బీసీ హాస్టల్ భవనాన్ని పునరుద్ధరించండి

బీసీ హాస్టల్ భవనాన్ని పునరుద్ధరించండి

విశ్వంభర, ఆమనగల్ :  మున్సిపాలిటీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్ ను  కల్వకుర్తి కంటెస్టెడ్ ఎమ్మెల్యే వినయ్ విప్లవ్ కలిశారు.  పట్టణంలో ఉన్న బీసీ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా ఉందని, నాలుగు మండలాల కూడలి అయిన ఆమనగల్లులో  విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను హాస్టల్ యొక్క పరిస్థితి చూడాలని వినయ్  కోరడంతో వెంటనే చైర్మన్, కమిషన్ సభ్యులతో కలిసి హాస్టల్లో సందర్శించి  నూతన భవనానికి కావలసిన బడ్జెట్ కొటేషన్ ఇవ్వాలని అధికారులకు సూచించారని వినయ్ తెలిపారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, మాజీ వార్డ్ సభ్యులు మల్లేష్ నాయక్, ఎమ్మార్వో లలిత, తదితర అధికారులు, గ్రామస్తులు ఉన్నారు.

Tags: