హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం

విశ్వంభర , హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ అధ్యక్షతన, హైదరాబాద్,సన్నాహక సమావేశం జరిగింది.శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తో సహా, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబిత ఇంద్రా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు షంభీపూర్ రాజు, నవీన్ రావు, వాణి దేవి, దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే లు, మాధవరం కృష్ణ రావు, మాగంటి గోపీనాథ్, బండారి లక్ష్మా రెడ్డి, డి. సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేష్,మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నేతలు, కొప్పుల మహేష్ రెడ్డి, డా. మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పటోళ్ల కార్తీక్ రెడ్డి, మన్నె గోవర్ధన్ రెడ్డి, జయసింహ ,మాజీ చైర్మన్ మన్నె కృశాంక్, మాజీ చైర్మన్ గజ్జెల నగేష్, కుమారి నివేదిత సాయన్న, పంజుగుల శ్రీశైల్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, పార్టీ నేత కల్వకుంట్ల వంశీధర్ రావు... తదితరులు పాల్గొన్నారు.