ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ -   శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

  ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ -   శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

విశ్వంభర, వికారాబాద్ : ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలో పాత గంజిలోని చౌక ధర దుకాణం లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సభాపతి ప్రారంభించారు.  ఈ సందర్భంగా సభాపతి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 10 లక్షల మంది లబ్ధిదారులకు ప్రజా పంపిణీ పథకంలో భాగంగా చౌక ధరల దుకాణాలు ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల నూతన రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. వికారాబాద్ జిల్లాలో నూతనంగా 22,404 రేషన్ కార్డులను మంజూరి చేయడం జరిగిందని ఆయన తెలిపారు.  జిల్లా వ్యాప్తంగా 2,48,122 రేషన్ కార్డుల ద్వారా 8,52,122 మంది లబ్ధిదారులకు చౌక ధరల దుకాణాల ద్వారా నెలకు 5,582 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ , డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్డీవో వాసు చంద్ర, జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు, తహసిల్దార్ లక్ష్మీనారాయణ, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Read More నల్లగొండ అదనపు కలెక్టర్ కు BIS ప్రమాణాల బ్రోచర్ అందజేత 

Tags: