యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం -పాల్గొన్న ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి

విశ్వంభర, జనగాం జిల్లా : దేవరుప్పుల మండల కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ సమీక్షా సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఝాన్సి రెడ్డి మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలంటే ముందుగా యువత బలోపేతం కావాలి యువజన నాయకులు తాము ఉన్న గ్రామాల్లో ప్రజల సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి పోరాడాలి యువతే ఈ దేశ భవిష్యత్తు. అందుకే మీరు నిరంతరం ప్రజలతో మమేకమై ఉండాలి అని సూచించారు..గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం నిరంతర చైతన్యం అవసరం ప్రజల మధ్య పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లి, పేద ప్రజలకు మద్దతుగా నిలవాలి యువజన నాయకులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి. సోషల్ మీడియా వేదికగా పార్టీకి మద్దతు ప్రచారం చేయాలి. ఈ సమీక్ష సమావేశంలో నల్లా ఆండాలు, రాపాక సత్యనారాయణ, నల్లా శ్రీరామ్, రాజేష్ నాయక్, వెంకన్న,భోనగిరి యాకన్న,వేల్పుల క్రిష్ణ, కొడకండ్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.