సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం.
On

విశ్వంభర, హైదరాబాద్ : పాతబస్తీ చంద్రాయణ గుట్ట నియోజకవర్గంలోని లలితాబాగ్ డివిజన్ మల్లికార్జున నగర్ లో శ్రీ విఘ్నేశ్వర సాయిధామం ఆలయంలో 24వ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం బ్రోచర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ స్వామి వారి కళ్యాణం తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మిద్దెల చంద్రశేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ మునిగంటి సుశీల్ కుమార్ చారి ,అధ్యక్షులు బొడ్డు వెంకటేష్, కోశాధికారి గుండు శ్రీకాంత్, యూత్ కమిటీ అడ్వైజర్ వీర బోయిన శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.