రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటిన సన్ షైన్ విద్యార్థులు

విశ్వంభర , నల్గొండ జిల్లా చండూర్ మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి యునైటెడ్ నల్గొండ డిస్ట్రిక్ట్ తైక్వాండో చాంపియన్ షిప్ పోటీలలో స్థానిక సన్ షైన్ పాఠశాలకు చెందిన విద్యార్థి దాచెపల్లి వెంకట్ సాయి అత్యుత్తమ ప్రదర్శన కనబరచి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పథకం గెలుపొందాడు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కోడి వెంకన్న వారిని అభినందిస్తూ సన్షైన్ విద్యార్థులు చదువులతో పాటు ఆటలలో కూడా అగ్రస్థానంలో రాణిస్తారు అనడానికి గతంలో జరిగిన తైక్వాండో పోటీలలో మూడు సార్లు బంగారు పథకం రెండు సార్లు కాంస్య పథకం సాధించిన వెంకట్ సాయి పట్టుదలే నిదర్శనమని అన్నారు. అదేవిధంగా తైక్వాండో ఆత్మరక్షణలో భాగం మాత్రమే కాదంటూ మానసిక ఉత్తేజాన్ని కలిగిస్తూ భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించడానికి సహాయపడుతుందని అన్నారు. ఈ కరాటే పోటీలో తెలంగాణ రాష్ట్రం నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నప్పటికీ క్రమశిక్షణ, చురుకుతనం మరియు క్రీడా స్ఫూర్తిని ఉన్నత స్థాయిలో ప్రదర్శించిన సన్ షైన్ విద్యార్థులను బహుమతులు వరించాయని, అదేవిధంగా ప్రతి ఒక్కరు క్రమశిక్షణ కలిగి ఉండడం ద్వారా ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మ , ప్రిన్సిపల్ రవికాంత్, ప్రవీణ్, లతీఫ్ పాషా మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.