చండూరులో జూనియర్ సివిల్ కోర్ట్..!

విశ్వంభర, చండూరు :- చండూరులో జూనియర్ సివిల్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆ ప్రాంత న్యాయవాదులు నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజుకి వినతి పత్రం అందజేశారు. గత 20 ఏళ్ల క్రితం చండూరుకు కోర్టు మంజూరైనప్పటికీ నేటికీ ఏర్పాటు కాలేదు. నాంపల్లి, మర్రిగూడ మండలాలకు చెందిన ప్రజలు దేవరకొండ వరకు, గట్టుప్పల, మునుగోడు, చండూరు ప్రజలు నల్గొండ వరకు వెళ్లాల్సి వస్తోందని, దీంతో దూర భారం తప్పడం లేదని వాపోయారు. నిజానికి కోర్టు ఏర్పాటుకు చండూరు అన్ని విధాల అనువుగా ఉంది. రెవిన్యూ డివిజన్ గా కూడా మారింది. చండూరు అన్ని విధాల అర్హతగా ఉన్నప్పటికీ దీనికంటే ముందు మరికొన్ని ప్రాంతాల్లో సైతం కోర్టులు ఏర్పాటయ్యాయి. ఇప్పటికైనా కోర్టు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గుర్రం వెంకటరెడ్డి, డోలే నర్సాజి, అయితగోని లాల్ బహుదూర్ గౌడ్ , బొమ్మరబోయిన వెంకన్న, భువనగిరి రవి, ఆవుల ప్రేమ్ సుందర్, గంజి వెంకటేశ్వర్లు, ఏలే గీత, బరిగల నగేష్, మోర ప్రవీణ్ కుమార్, రమేష్, బొబ్బల స్వామినాథ్ , బరిగల వెంకటేష్, రవి, ఏలె వెంకటేశ్వర్లు, గంజి భావన ఋషి, మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.