మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు - ట్రాఫిక్ ఎస్సై వెంకటేష్
On

విశ్వంభర, వికారాబాద్ : మద్యం సేవించి వాహనాలు నడిపితే ఊరుకునే ప్రసక్తే లేదని ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్ అన్నారు. వికారాబాద్ పరిధిలోని ఆలంపల్లి రోడ్డులో ట్రాఫిక్ ఎస్సై వెంకటేష్ డ్రంక్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, వారి కుటుంబాలు రోడ్డున పడుతాయి కాబట్టి ఆల్కహల్ సేవించి వాహనాలు నడపకూడదని అన్నారు. ప్రతిఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు. మైనర్ లు వాహనాలు నడిపితే తల్లితండ్రులు మీద కేసు అవుతుంది అని, వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ డ్రైవ్ లో పోలీస్ సిబ్బంది నర్సింహులు, ఎల్లయ్య పాల్గొన్నారు.