నిద్రలో హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

నిద్రలో హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

 

ఈ రోజుల్లో చాలా మందికి గుండె సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా పురుషులలో నలభై సంవత్సరాలు దాటిన వారిలో ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం తెలిపింది. నిద్రలో గుండె ఆగిపోయి ప్రాణాలను వదులుతున్నారు అని నిపుణులు తెలుపుతున్నారు. గుండె సమస్యలు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల  ఈ సమస్యలను కంట్రోల్ చేయవచ్చని వైద్యులు అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం. 

Read More పాక నైపుణ్యాలలో చెఫ్ హరీష్ కుమార్ అద్భుతాలు 

అధిక కొలెస్ట్రాలే కారణం..

శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడమే నిద్రలో గుండె ఆగిపోవడానికి కారణం అని స్టడీలో తేలింది. కొలెస్ట్రాల్ స్థాయి అధికంగా పెరిగి పురుషుల్లో హార్ట్ ఎటాక్స్ కు కారణమవుతున్నాయని నిపుణులు తెలిపారు. శరీరంలో కొవ్వు  ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతే కాకుండా గుండె పై ప్రభావం చూపిస్తుంది. 

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల గుండె కు వెల్లే రక్తాన్ని అడ్డుకుంటుంది. ధమనులల్లో అధిక కొలెస్ట్రాల్ పెరిగి గుండెకు రక్తప్రసరణ అందడం కష్టంగా మారుతుంది.  ఆ సమయంలో గుండె సమస్యలు పెరుగతాయి.

డైట్ లో మార్పు..
 
శరీరంలో అధిక కొలెస్ట్రాల్ వున్నప్పుడు ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. డైట్ ను ఫాలో అవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి కంట్రోల్ లో వుంటుంది అని నిపుణులు చెపుతున్నారు. రెడ్ మీట్  దూరంగా వుండాలని చెపుతున్నారు.

వ్యాయామం..
 
వ్యాయామం చెయడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. వ్యాయామం చేయడం వల్ల జీవన శైలీలో మార్పులు వస్తాయి.

ఈ లక్షణాలు

కొలెస్ట్రాల్ లక్షణాలు అంత త్వరగా  కనిపించవు  కాళ్లపాదాలలో  చిన్న చిన్న గడ్డలుగా కనిపిస్తాయి.అంతే కాకుండా ఎక్కిళ్లు కూడా వస్తాయి.