వండిన వెంటనే ఆహారాన్ని తినక పోతే చాలా డేంజర్
ఈ రోజుల్లో ఉరుకులు, పరుగుల జీవితాలతో చాలా మంది సమయానికి భోజనం చేయట్లేదు. అంతే కాదు ఉదయం ఎప్పుడో వండుకున్న దాన్ని ఏ మధ్యాహ్నమో, సాయంత్రమో, ఇంకొంత మంది అయితే ఏ అర్థరాత్రో తినేస్తున్నారు. అయితే ఇలా వండిన వెంటనే తినకపోతే చాలా ప్రమాదం అని.. అనారోగ్య సమస్యలు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ) తెలిపింది.
వండిన వెంటనే తిన్న వారే ఆరోగ్యంగా ఉంటారని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. చాలా మంది తినడంలో ఆలస్యం చేస్తూ ఉంటారు. ఇంట్లోని మహిళలు ఎప్పుడో వంట చేసి రెడీగా ఉంచినా.. రకరకాల పనుల వల్ల.. ఇతర విషయాల వల్ల ఆలస్యం అవుతూ ఉంటుంది. దీని వల్ల అనారోగ్యానికి గురవుతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం.. ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్ల మంది ప్రజలు కలుషిత ఆహారం తిని అనారోగ్య పాలు అవుతున్నారని చెబుతోంది. మంచి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల కూడా ఇలాంటివి వస్తాయని చెబుతోంది. కాబట్టి వండిన వెంటనే తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఎందుకంటే వంట వండే సమయంలో ఆహారంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా దాదాపు నాశనం అవుతుంది. కానీ ఆహారాన్ని చల్లార్చితే మళ్లీ అందులో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందంట. అందుకే ఆహారంవేడిగా ఉన్నప్పుడే తినేయాలి.