ఈ చిట్కాలు పాటిస్తే పంటినొప్పి దూరం..!
చాలా మంది ఈ రోజుల్లో పంటినొప్పితో బాధపడుతున్నారు. అయితే పంటి నొప్పికి రెండు రకాల కారణాలు ఉంటాయి. అందులో ఒకటి దంతాల నొప్పి, రెండోది చిగుళ్లు. ప్రస్తుత రోజుల్లో తింటున్న తిండితో పాటు లైఫ్ స్టైల్ కారణంగానే పంటి నొప్పి చిన్న పిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల దాకా అందరికీ వస్తోంది.
అయితే ఇలా నొప్పి వచ్చినప్పుడు చిటికెడు పటిక, చిటికెడు రాళ్ల ఉప్పు, 2 లవంగాలు తీసుకొని గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. ఇవి బాగా మరిగిన తర్వాత వడబోసి కొంచెం గోరువెచ్చగా ఉండేంత వరకు ఉంచాలి. ఆ తర్వాత నోటిలో పోసుకుని పుక్కిలించాలి. పంటినొప్పి, పైయోరియా సమస్య నుంచి ఈజీగా ఉపశమనం లభిస్తుంది.
ఇక లవంగాలు నమిలినా సరే ఈ పంటినొప్పి ఈజీగా తగ్గిపోతుంది. ఇది నోటి నుంచి దుర్వాసనను కూడా తొలగిస్తుంది. ఇక అకర్కర పువ్వు వల్ల కూడా నొప్పి తగ్గుతుంది. ఈ పువ్వును పంటినొప్పి ఉన్న చోట పెడితే ఈజీగా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.