పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..
On
ఈ నడుమ హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జై బోలో తెలంగాన సినిమాలో నటించిన హీరోయిన మీరా నందన్ కూడా పెళ్లి పీటలు ఎక్కింది. అప్పట్లో ఈ సినిమా ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు అలరిస్తూనే ఉంటాయి.
అయితే ఈ సినిమాలోని హీరోయిన్ మీరా నందన్ తన ప్రియుడు శ్రీను శనివారం పెళ్లి చేసుకుంది. ఆమె మలయాళ ఇండస్ట్రీలో 2008లో ముల్లా అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. దాని తర్వాత తమిళంతో పాటు మలయాళంలో చాలానే సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ భామ.
తెలుగులో హితుడు, ఫోర్త్ డిగ్రీ లాంటి సినిమాల్లో నటించింది. కేవలం హీరోయిన్ గానే కాకుండా కీలక పాత్రల్లో కూడా నటించి మెప్పించింది. సింగర్ గా, డ్యాన్సర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా రాణించింది ఈ ముద్దుగుమ్మ. ఆమె ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు.