రక్త పోటును తగ్గించుకోవడానికి ఈ ఆహారాలను తీసుకోండి

రక్త పోటును తగ్గించుకోవడానికి ఈ ఆహారాలను తీసుకోండి

 

Read More పాక నైపుణ్యాలలో చెఫ్ హరీష్ కుమార్ అద్భుతాలు 

 

Read More పాక నైపుణ్యాలలో చెఫ్ హరీష్ కుమార్ అద్భుతాలు 

ఈ రోజుల్లో చాలా మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మారిన జీవనశైలితో పాటు.. అనేక రకాల ఆహారాలను కూడా తీసుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆహార పదార్థాలను రెగ్యులర్ గా తీసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని డాక్టర్లు చెబుతున్నారు. 

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాలకూర. ఇందులో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో ఇవి బాగానే సాయం చేస్తాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

అరటిపండ్లలో కూడా మినరల్స్ ఎక్కువగా ఉంటయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి డ్రై ఫ్రూట్స్‌కు సాటి మరేదీ లేదు. ఇందులో ఎక్కువగా పిస్తా పప్పులను తీసుకోవాలి. ఇవి రక్తపోటును కంట్రోల్ లో ఉంచడంలో సాయం చేస్తుంటాయి.