మహిళలకు 'చేయూత" వరం లాంటిది
రూరల్ సిఐ సర్వయ్య,

విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలం జంగిల్కొండ గ్రామం మహిళలకు చేయూత వరం లాంటిదని మహబూబాబాద్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్వయ్య అన్నాడు. గురువారంనాడు జంగిలిగొండలో చేయూత స్వచ్ఛంద సంస్థ ప్రారంభించిన కుట్టుమిషన్ శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ గుండెలరాజు సారధ్యంలో చామకూరి సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐ సర్వయ్య మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో మహిళ పాత్ర కీలకన్నారు. పురుషాధిక్య ప్రపంచంలో మహిళ తన ప్రాముఖ్యతను చాటుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. మహిళలు ఈకుట్టు మిషన్ శిక్షణ ద్వారా ఆర్ధికంగా వృద్ధిచెందడమే కాకుండా కుటుంబానికి ఆసరాగా నిలిచి ఆత్మగౌరవంతో బ్రతుకుతారన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ రూరల్ ఎస్సై దీపికారెడ్డి, శంతన్ రామరాజు, లోకేష్, పంజాల సురేష్, మట్టిగజం వీరేశ్, భూం హరీష్, పైండ్ల మదు, గోల్కొండ సతీష్, చామకూరి యాసీన్, గోల్కొండ శ్రీకాంత్, కోయ్యాల అనిల్, పెరుమండ్ల ప్రతాప్ ,కొమ్మరాజుల భరత్, ఫైండ్ల రాధాకృష్ణ, పంజాల సందీప్, పోతుగంటి రమణాచారి, ఇరుగు ప్రభాస్, కుంట సురేష్ తదితరులు పాల్గొన్నారు.