క్షతగాత్రులను పరామర్శించిన కెవిపిఎస్, ఎమ్మార్పీఎస్

క్షతగాత్రులను పరామర్శించిన  కెవిపిఎస్, ఎమ్మార్పీఎస్

విశ్వంభర, మహబూబాబాద్: నర్సింహులపేట మండలం పెద్దనాగారం వద్ద రోడ్డుప్రమాదానికి గురై మానుకోట ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిళ్ల పీరయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుడ్డెల రామ్మూర్తి తమ బృందంతో వెళ్లి శుక్రవారం పరామర్శించారు. బాధితులను అడిగి జరిగిన ఘటన గురించి ఆరా తీశారు. వారి వారి కుటుంబ నేపథ్యాలు తెలుసుకుని చెలించిపోయారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రెక్కాడితే గాని డొక్కాడని దళిత పేద కుటుంబాలు రోడ్డు ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయని, ఆర్థికంగా వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వారి వెంట కేవీపీఎస్, ఎమ్మార్పీఎస్ నాయకులు మందుల మహేందర్,  ప్రశాంత్, కందిపాటి బిక్షపతి .కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: