తైక్వాండో పోటీలలో గాంధీజీ విద్యార్థుల ప్రభంజనం 

విజేతలను అభినందించిన డా. కోడి శ్రీనివాసులు

 తైక్వాండో పోటీలలో గాంధీజీ విద్యార్థుల ప్రభంజనం 

  •  ఆత్మరక్షణకు, శారీరక దృఢత్వానికి   తైక్వాండో దోహదపడుతుంది
  • విజేతలకు ట్రస్మా జిల్లా అధ్యక్షుడు  అభినందనలు 

విశ్వంభర, చండూర్:  ఆత్మ రక్షణకు, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి తైక్వాండో ఎంతగానో దోహదపడుతుందని ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. ఈ నెల 23వ తేదీ ఆదివారం నాడు చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని మార్కెట్ యార్డ్ నందు నిర్వహించిన యునైటెడ్ నలగొండ జిల్లా తైక్వాండో ఛాంపియన్షిప్ -2025 పోటీల్లో చండూరు మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన గాంధీజీ విద్యాసంస్థలలోని విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి, పతకాలను సాధించారు. పతకాలు సాధించిన విద్యార్థుల్లో రేయాన్, మధుశ్రీ స్వర్ణ పథకాలు, అనన్య, శ్రాగ్వి, ఆదిత్య, అరవింద్ లు రజత పతకములను, రేవంత్, ఆయేషా అంజూమ్, యశ్వంత్,వీరజ్ లు  కాంస్య పథకాలను సాధించారు. వీరిని గురువారం నాడు గాంధీజీ విద్యాసంస్థల్లో ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు మెడల్స్ ను,  సర్టిఫికెట్స్ ను అందించి అభినందించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యార్థులు జాతీయస్థాయి మరియు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పథకాలను సాధించి చండూరుకు, చదువుకున్న పాఠశాలకు, కన్న తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆశించారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఆత్మ రక్షణ కోసం తైక్వాండో నేర్చుకోవాలని అన్నారు. తమ పాఠశాలలో విద్యార్థులకు అన్ని రంగాల్లో నైపుణ్యం పెంచే శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, వారిలో ఆత్మ సైరాన్ని పెంచడానికి వివిధ వేదికలపై జరిగే కార్యక్రమాలకు విద్యార్థులను పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్స్ సత్యనారాయణమూర్తి, పులిపాటి రాధిక, తైక్వాండో ట్రైనర్ నాగిల్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: