నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ పై అవగాహన

డాక్టర్ జి మురళీధర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి.

నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ పై అవగాహన

విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ తెలంగాణ ఆదేశానుసారం శుక్రవారం మహబూబాబాద్ పట్టణంలోని లయన్స్ క్లబ్ లో జిల్లా లెవెల్ టి ఓ టి శిక్షణ జాతీయ సికిల్ సెల్ అనీమియా పై అవగాహన,  ఒకరోజు శిక్షణా కార్యక్రమం జిల్లాలోని వైద్యాధికారులందరికీ అవగాహన  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి మురళీధర్  మాట్లాడుతూ, సికిల్ సెల్ వ్యాధి లేదా "సికిల్ సెల్ అనీమియా "అనేది ఒక వంశానుగత రక్త రుగ్మత, సాధారణంగా మనిషి రక్తంలోని ఎర్ర రక్త కణాలు  గుండ్రని ఆకారంలో ఉంటాయని, ఈ కణాలు రక్తనాళాల ద్వారా శరీరమంతా ప్రయాణిస్తూ వివిధ అవయవాలకు ప్రాణవాయువును (ఆక్సిజన్ )ను సరఫరా చేస్తుంటాయని, కొంతమందిలో జన్యు సంబంధ మార్పుల వల్ల ఎర్ర రక్త కణాలు కొడవలి (సికిల్ )ఆకారంలోకి మార్పు చెందుతాయని అన్నారు. రక్తకణాల జీవితకాలం 120 రోజులు అయితే సికిల్ సెల్  రక్త కణాల జీవితకాలం 20 నుంచి 25 రోజులు మాత్రమే ఉంటాయని జీవిత కాలం 20 నుంచి 25 రోజులు మాత్రమే ఉంటాయని సికిల్ రక్త కణాలు నశించి పోయేంత వేగంగా కొత్త ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కాకపోవడంతో ఈ వ్యాధి ఉన్నవారు రక్తహీనతకు గురి అవుతారని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ సారంగం, డాక్టర్ సుధీర్ రెడ్డి, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ లక్ష్మీనారాయణ,   ప్రోగ్రామ్ ఆఫీసర్ సికిల్ సెల్ డాక్టర్ శ్రవణ్ కుమార్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ విజయకుమార్ మరియు డాక్టర్ గణేష్ పీడియాట్రిషన్ నిమ్స్, డాక్టర్ రమేష్ టెక్నికల్ ఆఫీసర్ ఎన్ హెచ్ ఎం, డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, కె.వి.రాజు, పురుషోత్తం శారద హెల్త్ ఎడ్యుకే టిర్స్, సబ్ యూనిట్ ఆఫీసర్స్ రామకృష్ణ, వడ్డెబోయిన శ్రీనివాస్, డీఈవో ఉమాకర్, అరుణ్ వైద్యాధికారులు పాల్గొన్నారు.

Read More క్షతగాత్రులను పరామర్శించిన కెవిపిఎస్, ఎమ్మార్పీఎస్

Tags: