నల్లగొండ అదనపు కలెక్టర్ కు BIS ప్రమాణాల బ్రోచర్ అందజేత 

నాణ్యత ప్రమాణాల ద్వారా వినియోగదారులకు అవగాహన కల్పించాలి - జిల్లా అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ 

నల్లగొండ  అదనపు కలెక్టర్ కు BIS ప్రమాణాల బ్రోచర్ అందజేత 

పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య (క్యాట్కో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలే వెంకటేశ్వర్లు 

విశ్వంభర, నల్లగొండ;  ప్రపంచ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకొని భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు ఆహారం మరియు సరఫరాల మంత్రిత్వ శాఖ వారిచే వితరణ చేయబడిన భారత నాణ్యత ప్రమాణాల బ్రోచర్లను నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ కు అందజేశారు. భారత నాణ్యత ప్రమాణాల సంస్థ వివిధ రకాల వస్తువులు వాహనాలు పరికరాలు పనిముట్లు తినుబండారాలు ఆహార ఉత్పత్తులు వంట నూనెలు ఆభరణాలు వస్త్రముల పై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య (క్యాట్కో) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలే వెంకటేశ్వర్లు అన్నారు. మందులు ఎరువులు పురుగు మందులు విత్తనాల లాంటి అనేక రకాల ఉత్పత్తుల తయారీ కోసం నాణ్యత ప్రమాణాలు తనిఖీ చేసి ఆయా కంపెనీలకు అమ్మకం లైసెన్స్ మరియు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తుంది. అమ్మకం ధర తయారీ తేదీ కాలపరిమితి వారంటీ గ్యారెంటీ మొదలగును అనిత ప్రమాణాలను వినియోగదారులు తనిఖీ చేసుకొనుటకు ఉపయోగపడే బిఐఎస్ కేర్ యాప్ ఉపయోగం మొదలగు వివరాలతో కూడిన బ్రోచర్లను అందించారు. ఈ కార్యక్రమంలో  చింతమల్ల గురువయ్య, అన్నెబోయిన మట్టయ్య, బొల్లు మధు,  తదితరులు పాల్గొన్నారు.

Tags: