రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం

గిరిజన ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కృష్ణ నాయక్

రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం

విశ్వంభర, రంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ తీసుకువచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి మనమందరం కృషిచేయాలని, అప్పుడే ఇందిరా గాంధీ సూచించిన ఇరవైసూత్రాల కార్యక్రమం అమలవుతుందని రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ నాయకుడు కృష్ణ నాయక్, అన్నారు. గురువారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అనంతగిరిలోని హరిత రిసార్ట్లో ఉమ్మడి రంగా రెడ్డి జిల్లాస్థాయి ఆదివాసీ కాంగ్రెస్ బునియాది కార్యకర్తల సమ్మేళనం ముగింపు సమావేశానికి స్పీకర్ గడ్డం ప్రసాద్, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో  రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి కార్యకర్తలుగా ఎంత కష్టపడుతున్నారో తాను అంతకు రెట్టింపు కష్టపడతానని అన్నారు. రాజ్యాంగంలో 5, 6షెడ్యూలు ప్రత్యేకంగా గిరిజనులకు, ఆది వాసీలకు కేటాయించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ గిరిజనులు, ఆదివాసీలకు రాజ్యాంగ హక్కులను కట్టబెట్టిందన్నారు. రిజర్వేషన్లు ఉపయోగించుకొని నేడు గిరిజనులు విద్యా, ఉద్యోగరంగాలలో అభి వృద్ధి చెందుతున్నారని తెలిపారు. దానికి కారణం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కల్పించిన రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు కారణమని అన్నారు.

Tags: