మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం.

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో మండల ఎంఆర్పిఎస్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సభబే అని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు మేరకు తెలంగాణ ప్రభుత్వం నిండు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు, వర్గీకరణ పోరాటంలో అమరులైన మాదిగ అమర వీరులకు నివాళి అర్పిస్తూ, మందకృష్ణ మాదిగ పోరాట పటిమను, ధీరత్వాన్ని కీర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, రామన్నపేట మండల కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర అణగారిన వర్గాల ఆశాజ్యోతి, వికలాంగుల భగవంతుడు, సబ్బండ వర్గాల ఆత్మబంధువు, మాదిగల మహాత్ముడు, అభినవ అంబేద్కర్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు.