బడ్జెట్లో విద్యా రంగాన్నీ విస్మరించినందుకు నిరసనగా

బిఆర్ఎస్వి అసెంబ్లీ ముట్టడి..

బడ్జెట్లో విద్యా రంగాన్నీ విస్మరించినందుకు నిరసనగా

విశ్వంభర, రామన్నపేట: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 7.53 శాతమే బడ్జెట్ ను విద్యా రంగానికి కేటాయించడం వల్ల విద్య పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ కాంగ్రెస్ సర్కార్ మన ముందు కనబడుతుంది అని యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలానికి చెందిన బి.ఆర్.ఎస్.వి నకిరేకల్ నియోజకవర్గ మాజీ అధ్యక్షులు జెట్టి శివ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్లు విద్యార్థులకు రావాల్సిన బకాయిలు అనగా స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్లో ఉన్నాయి, కానీ, మొన్న గురువారం  అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 7.53 శాతమే, 23,108 కోట్లు మాత్రమే కేటాయించారని, ఈ బడ్జెట్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు కూడా సరిపోని పరిస్థితి ఉన్నదని అన్నారు. హామీలు మాత్రం గంపెడిచ్చి బడ్జెట్ మాత్రం అరకొర కేటాయించారని అన్నారు. ప్రతి విద్యార్థికీ 5 లక్షల విద్య భరోసా కార్డుకు బడ్జెట్లో సున్నా కేటాయింపులని, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఊసే లేదని, ప్రతి మండలానికి ఒకటి అని చెప్పి నేడు నియోజకవర్గానికి ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామని అనడం దానికి బడ్జెట్ కేటాయించకపోవడం దుర్మార్గం అని అన్నారు.ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట శ్రీను, రాష్ట్ర నాయకులు  కుర్వ పల్లయ్య తదితరులు పాల్గొన్నారు

Tags: