పిల్లి శ్రీనివాస్ సభ్యత్వానికే దిక్కులేదు -మున్నూరు కాపు మహాసభ

విశ్వంభర, కాచిగూడ: రెండు వందల రూపాయలకు జీవిత కాల సభ్యత్వం ఇవ్వడం చెల్లదని..అంత డబ్బులు దండుకోవడం కోసమే పిల్లి శ్రీనివాస్ ఇవి అన్ని చేస్తున్నాడు అని దీనికి, మున్నూరు కాపు మహాసభకు సంబంధం లేదని మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్రావు వెల్లడించారు . మహాసభ అధ్యక్షుడిగా చెప్పుకొంటున్న పిల్లి శ్రీనివాసరావు ఈ నెల 23న సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంతోనూ తమకు సంబంధం లేదన్నారు. అసలు సభ్యత్వం లేని వాడు ఎలా సభ్యత్వాన్ని ఇస్తాడు అని ప్రశ్నించారు. గురువారం కాచిగూడ మున్నూరు కాపు సంఘంలోని మహాసభ కార్యా లయంలో ఆయన మాట్లాడారు. కోర్టు నియమించిన అడ్వకేట్ కమిషన్ నిర్వ హించిన ఎన్నికల్లో తాను మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ని కైనట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో రవి, బీఆర్ జితేందర్, వినోద్ కుమార్ , రమేష్ కుమార్, శ్రీకాంత్, సురేష్ బాబు, రామారావు, భాస్కర్, సత్యనారాయణ పాల్గొన్నారు.