రాత్రి పడుకునే ముందు ఈ పండ్లను తింటే చాలా డేంజర్..

రాత్రి పడుకునే ముందు ఈ పండ్లను తింటే చాలా డేంజర్..

 

ఈ రోజుల్లో ఆహార పద్ధతులు తెలుసుకుని తినడం చాలా మంచిది. ఎందుకంటే ఏ సమయంలో వేటిని తినాలి, వేటిని తినొద్దు అనేది మనకు అవగాహన ఉంటేనే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. లేదంటే ఏది పడితే అది తింటే మాత్రం మన ఆరోగ్యం డేంజర్ జోన్ లో పడ్డట్టే అని అంటున్నారు డాక్టర్లు. ఇక రాత్రి సమయంలో ఈ ఐదు పండ్లను తింటే మాత్రం కచ్చితంగా డేంజర్ అంట. అవేంటో చూద్దాం.

Read More పాక నైపుణ్యాలలో చెఫ్ హరీష్ కుమార్ అద్భుతాలు 

ద్రాక్ష..

ద్రాక్ష పండ్లను రాత్రి సమయంలో తింటే హానికరం అని చెబుతున్నారు డాక్టర్లు. ఎందుకంటే ఇందులో సిట్రిక్ ఉంటుంది.. దీని కారణంగా గుండెల్లో మంట వచ్చే ప్రమాదం ఉంది. దాంతో పాటు షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

పుచ్చకాయ..

రాత్రి సమయంలో పుచ్చకాయను తింటే  ఆరోగ్యానికి చాలా డేంజర్. ఇది తింటే రాత్రి మాటిమాటికి మూత్ర విసర్జన అవుతుంది. దాంతో నిద్ర భంగం ఏర్పడుతుంది. 

నారింజ..

ఆరెంజ్ లో ఎక్కువగా సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి అది బాడీకి రాత్రి సమయంలో తింటే డేంజర్. కడుపునొప్పికి దారి తీసే ప్రమాదం ఉటుంది. 

జామకాయ..

జామకాయల్లో కూడా పీచు ఎక్కువగా ఉంటుంది. కానీ రాత్రి తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. దాంతో కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. 

అరటిపండు..

అరటిపండును రాత్రి సమయంలో తింటే ఊబకాయం వస్తుంది. ఎందుకంటే ఇందులో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఐదు పండ్లను రాత్రి తినకపోతేనే చాలా బెటర్.