వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన -ఏపీఎం నరేందర్ కుమార్
పాల్గొన్న జిన్నారం కాంగ్రెస్ పార్టీముఖ్య నాయకులు
On
విశ్వంభర, సంగారెడ్డి జిల్లా : జిన్నారం మండల కేంద్రంలో ఊట్ల గ్రామాలలో యాసంగి వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏపిఎం నరేంద్ర కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పక్షాన నిలుస్తూ రైతులను తెలంగాణ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలనదే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని రైతులందరూ ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ, వైస్ ఎంపీపీ గంగు రమేష్. సీసీ సుజాత. బేబీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.



