అంబెడ్కర్ రాజ్యాంగానికి వ్యతరేకంగా బీజేపీ పాలన -- ఆఫ్ కన్వీనర్ సుధాకర్
విశ్వంభర, బషీర్ బాగ్: దేశ పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం, సామజిక న్యాయం అందించిన అంబెడ్కర్ రాజ్యాంగానికి వ్యతరేకంగా బీజేపీ పాలన కొనసాగిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. మనుస్మృతి బీజేపీ కి చట్టం, అంబేద్కర్ రాజ్యాంగం కాదని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబెడ్కర్ 134 వ జయంతి సందర్బంగా హైదరాబాద్, ట్యాంక్ బండ్ అయన విగ్రహానికి డాక్టర్ దిడ్డి సుధాకర్ తదితరులు ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ పేదలకు అధికారం ఇస్తు, పాలనకు నైతిక మార్గదర్శిగా పనిచేస్తున్న భారత రాజ్యాంగాన్ని బీజేపీ క్రమపద్ధతిలో ద్వంసం చేసుకుంటూ వస్తుందని, రాజ్యాంగం తోపాటు ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని కూడా నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. చట్ట సవరణల పేరుతో దేశ ప్రజల హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ప్రజల స్వేచ్ఛ, హక్కులపై, రాజ్యాంగంపై జరుగుతున్న ప్రత్యక్ష దాడికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన పోరాటాలు నిర్వహించి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని రక్షించుకుంటామని డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్ నేతలు సుధారాణి, డా. లక్ష్య నాయుడు, జావేద్ షరీఫ్, అజిమ్ బేగ్, మోనికా, రాకేష్ రెడ్డి, ఎస్.ఎన్. రెడ్డి, నాగేందర్ ప్రసాద్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.



