భారత రాజ్యాంగం దేశానికి దిక్సూచి
రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి- కల్వకుర్తి ఎమ్మెల్యే
విశ్వంభర, ఆమనగల్లు: భారతదేశానికి దిక్సూచి అనబడే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనదే అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్ మండలంలోని ఆకుతోటపల్లి గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ గద్దర్ వెన్నెల పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించి సంవిధాన్ అభియాన్ గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేపించారు
కార్యక్రమంలో పిసిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ అధ్యక్షుడు యాట నరసింహ, మాజీ జెడ్పిటిసిశ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షుడు తెల్గమల్ల జగన్, పట్టణ అధ్యక్షుడు మానయ్య, మాజీ సర్పంచులు వెంకటరమణారెడ్డి, బలరాం సత్యం , అంజన్ రెడ్డి, మాజీ ఎంపీపీ అనిత విజయ్, శ్రీశైలం ,ప్రసాద్ , కొప్పు శేఖర్ రాజు గోవింద్, కొండయ్య, షఫీ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



