జైభీమ్ జైభీమ్ అంటూ నినాదించిన అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి: కే ఎల్ ఆర్
తుక్కుగూడ బస్టాండ్ చౌరస్తాలో డాక్టర్ బాబా సాహెబ్ ఘననివాళి
విశ్వంభర, మహేశ్వరం: తుక్కుగూడ : - డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా తుక్కుగూడ బస్టాండ్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు కేఎల్ఆర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగం వల్లే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయని కొనియాడారు. ఆ మహానీయుడు రాసిన సంవిధాన్ వల్ల దేశంలో స్వేచ్ఛ సమానం సౌభ్రాతృత్వం వెల్లు విరుస్తున్నాయని గుర్తు చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే కుట్రను బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తోందని కే ఎల్ ఆర్ ఆరోపించారు.భీమ్ రావ్ కలలు కన్న దేశం కోసం జైబాపు జైభీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భుజానికి ఎత్తుకుందని గుర్తు చేశారు. దేశ విచ్ఛిన్నకర శక్తులు మత విధ్వేషాలు రెచ్చగొట్టే వారిపై కాంగ్రెస్ కఠినంగా వ్యవహరిస్తోందని కేఎల్ఆర్ అన్నారు. జైభీమ్ జైభీమ్ అంటూ కేఎల్ఆర్ నినాదించటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సహం వచ్చింది.
ఈ కార్యక్రమంలో తుక్కుగూడ కందుకూరు. మహేశ్వరం కాంగ్రెస్ నేతల సహా నియోజకవర్గ మాజీ ప్రజాప్రతినిధులు. మహిళా.ఎస్సీ. ఎస్టీ. బీసీ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.



