వరంగల్ విజయవంతం చేద్దాం: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

వరంగల్ విజయవంతం చేద్దాం: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

విశ్వంభర, బడంగ్‌పేట్ : ఈనెల 27వ తేదీన వరంగల్ లో  జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దామని మాజీమంత్రి, మహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యురాలు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్‌లో టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 27న వరంగల్‌లో జరగబోయే భారీ బహిరంగ సభ "చలో వరంగల్"ను ఘనవిజయంగా నిర్వహించాలనీ, ప్రతీ కార్యకర్త తన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని మరింత పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె స్పష్టం చేశారు. నియోజకవర్గం మొత్తం నుండి కార్యకర్తలు భారీగా తరలివచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేశారు. ప్రతి కార్యకర్త పార్టీ విజయానికి బలమైన కండగా నిలవాలని, వరంగల్ సభ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా బిఆర్‌ఎస్ శక్తిని ప్రతిపాదించాలని ఆమె ఆకాంక్షించారు.ఈ సమావేశంలో మహేశ్వరం  బిఆర్‌ఎస్  ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ , మీర్పేట్ మాజీ మేయర్ తీగల విక్రం రెడ్డి, నియోజకవర్గ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పటేల్ సునీత రెడ్డి, గడ్డి అన్నారం ఈ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుట్టం పురుషోత్తం , పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: