ఎన్ హెచ్ ఆర్ సి & డబ్ల్యూ ఈ ఓ ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవా లు.
విశ్వంభర, హనుమకొండ జిల్లా: NHRC & WEO ఫౌండర్ అండ్ చైర్మన్ మొహమ్మద్ మోహినుద్దిన్ ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు విన్నకోట గోవర్ధన్ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా కాజీపేటలోని బోడ గుట్ట దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి 134 వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు విన్నకోట గోవర్ధన్ మాట్లాడుతూ అంబేద్కర్ రామ్ జి సక్వాల్, బీమా బాయిలకు 14 . 4. 1891 వ సంవత్సరంలో ( భీమ్రావు) జన్మనిచ్చారు . అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోదగిన వ్యక్తి చాలా గొప్ప మేధావి, అని అంబేద్కర్ని ప్రతి ఒక్కరు ఆదర్శo గా తీసుకోవాలని పిలుపునిచ్చా రు . మరియు ఈయన 1915 వ సంవత్సరంలో ఎంఏ డిగ్రీ పూర్తి చేశారని ఈయన రోజుకి 18 గంటలు చదువులోనే నిమగ్నమై ఉండేవాడని భారత దేశంలో నీ ప్రచిన వాణిజ్యం అనే గ్రంధాన్ని రాశారని గుర్తు చేశా రు . మళ్లీ 1920 వ సంవత్సరంలో ఉన్నత విద్యల కొరకు లండన్ వెళ్లారు ఆయన గుర్తు చేశారు. 1922 సంవత్సరంలో జర్మిని దేశంలో బాన్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు . 17 తారీకు సెప్టెంబర్ 1930 నుండి 21 నవంబర్ 1930 వరకు లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు . అంతేకాకుండా అంబేద్కర్కి 1931 వ సంవత్సరం డిసెంబర్ నెలలో బొంబాయి ప్రభుత్వం " జస్టిస్ ఆఫ్ పీస్" అనే బిరుదునిచ్చి గౌరవించారు . మళ్లీ 1932వ సంవత్సరంలో ఆగస్టు 14వ తేదీన కమ్యూనల్ అవార్డు ప్రకటించారు . అంబేద్కర్ 1945వ సంవత్సరం జూన్లో వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ది అన్ టచ్ టేబుల్స్ అనే పుస్తకాన్ని రచించారు .ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ కుమ్మరి సంపత్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అభిలాష్, రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్, జాతీయ ప్రతినిధి త్రివిక్రమ్ ,మరియు NHRC & WEO సభ్యులందరు పాల్గొన్నారు .



