పెద్ద కంజర్ల గ్రామంలో భార్యను రోకలి బండతో మోదీ హత్య చేసిన కసాయి భర్త
విశ్వంభర, సంగారెడ్డి జిల్లా : పటాన్ చేరు మండలం పెద్ద కంజర్ల గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కిష్టయ్య పల్లి గ్రామానికి చెందిన 32 సంవత్సరాల సురేష్ పెద్ద కంజర్ల గ్రామానికి చెందిన ప్రమీల 24 సం"లు ఐదు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి మూడు సంవత్సరాల పాప కలదు. సురేష్ మద్యం సేవించి ప్రమీలతో తరచూ గొడవ పడేవాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో గత కొంతకాలంగా తన తల్లి గారైన పెద్ద కంజర్ల గ్రామం లో నివాసం ఉంది.సోమవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో సురేష్ పెద్ద కంజర్ల గ్రామంలో తరచు లాగా సురేష్ మద్యం సేవించి గొడవపడుతూ భార్య ప్రమీలను రోకలి బండ తో కొట్టి హత్య చేశాడు.భార్య,భర్త మధ్య గొడవను ఆపేందుకు అడ్డు వచ్చిన అత్త కవిత పై సురేష్ దాడి కి పాల్పడడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా అత్తకు తీవ్రగాయాలు అయ్యాయి.అత్త కవితకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు మెరుగైన చికిత్స నిమిత్తం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు.అత్తగారైన కవిత పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్య చేసిన అనంతరం పటాన్చెరు పోలీస్ స్టేషన్లో నిందితుడులొంగిపోయాడు.కేసు పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.



