విద్యార్ధులు చదువుతో పాటు జనరల్ నాలెడ్జ్ పై పట్టు సాధించాలి.
ఐఎన్టీఎస్ఎవో ఫరీక్షలలో సత్తా చాటిన పాణినీయ విద్యార్దులు.
On
విశ్వంభర, ఎల్బీనగర్ : విద్యార్ధులు చదువుతో పాటు జనరల్ నాలెడ్జ్ పై పట్టు సాధించినప్పుడే ఉన్నత శిఖరాలను సులువుగా చేరుకుంటారని పాణినీయ మహా విద్యాలయ ప్రిన్సిపాల్ ఉషారాణి సూచించారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఐఎన్టీఎస్వో పరీక్షలలో పాణినీయ విద్యాలయ విద్యార్ధులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఐఎన్టీఎస్ వో రెండవ దశ ఫలితాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించినట్లు వెల్లడించారు. గ్రాండ్ ప్రైజ్లు పొందిన 9 మంది, బంగారు మెడల్స్ సాధించిన 163 మంది, కన్సోలేషన్ బహుమతులు పొందిన 63 మంది విద్యార్ధులను మంగళవారం పాఠశాలలో సత్కరించి, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏజీఎం సతీష్, ఆర్ఎస్ఐ రవీంద్ర, జోనల్ కో-ఆర్డినేటర్ రవికుమార్, డీన్ నాగేశ్వర్రావు, సి బ్యాచ్ ఇంచార్జ్ జ్యోతి, ఎస్ బ్యాచ్ ఇంచార్జ్ సుజాత తదితరులు పాల్గొన్నారు.



