డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా - బీ. ఆర్. అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివి
బీజేపీ నేతలు దీపక్ రెడ్డి, గౌతమ్ రావు. భరత్ గౌడ్
విశ్వంభర, హైదరాబాదు : భారతదేశ సమాజం కోసం బీ. ఆర్. అంబేద్కర్ విశిష్టమైన సేవలను అందించారని భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డి అన్నారు. అనంతరం బీజేపీ నగర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దీపక్ రెడ్డి మహంకాళీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశ తొలి న్యాయ శాఖ మంత్రిగా పనిచేసి పేదల కోసం పని చేశారని ఆయన పేర్కోన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బీ. ఆర్ అంబేద్కర్ ఎంతో చేశారని దీపక్ రెడ్డి గుర్తు చేశారు. అదేవిధంగా సీనియర్ నేత డా. ఎన్. గౌతమ్ రావు మాట్లాడుతూ బీ. ఆర్. అంబేద్కర్ భారతదేశ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని ఆయన తెలిపారు. అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివని గౌతమ్ రావు వివరించారు. ఈ కార్యక్రమంలో , కార్పోరేటర్లు అమృత, ఉమా రమేష్ యాదవ్, నేతలు కృష్ణ గౌడ్, అజయ్, గంగరాజు, సాధన ఠాకూర్, రమేష్ యాదవ్, చిట్టి శ్రీధర్, ప్రేమ్, నాగభూషణ్ చారి, షీర్ సాగర్ సూర్య ప్రకాష్ సింగ్ ప్రవీణ్ రామ్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.



