ఖమ్మం ప్రముఖ సాహితీవేత్త నంది అవార్డు గ్రహీత 

బుక్క సత్యనారాయణ ను సన్మానించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

 ఖమ్మం ప్రముఖ సాహితీవేత్త నంది అవార్డు గ్రహీత 

విశ్వంభర, ఖమ్మం : బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం ప్రముఖ సాహితీవేత్త నంది అవార్డు గ్రహీత బుక్క సత్యనారాయణ ను ఖమ్మం లోని క్యాంపు కార్యాలయం లో పూలమాల వేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు .ఇటీవల హైదరాబాదుకు చెందిన ప్రముఖ సంస్థ ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ సంస్థ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో ఖమ్మం నగరానికి చెందిన కవి రచయిత సామాజిక సేవకులు బుక్కా సత్యనారాయణకు ఒకే వేదికపై ఒకే సంస్థ నుండి వేరువేరు విభాగాల్లో మూడు విశిష్ట పురస్కారాలు అందుకున్న తొలి జిల్లా వ్యక్తిగా అరుదైన గుర్తింపు పొందారు.సత్యనారాయణ మున్ముందు అనేక పురస్కారాలు, అవార్డులు అందుకోవాలని ఖమ్మం జిల్లాకు కీర్తి ప్రఖ్యాతలు తీసుకురావాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సన్నిహితులు ఆకుల గాంధీ గారు,మధిర మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వర్ రావు,దిగదారి శ్రీనివాస రావు రిపోర్టర్ రజినీకాంత్, వెంకటప్పయ్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. 

Tags: