ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి : గండు ధనం రెడ్డి.

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి : గండు ధనం రెడ్డి.

విశ్వంభర, సరూర్ నగర్ : ఉచిత వైద్య శిబిరాలను కాలనీ వాసులు సద్వినియోగం చేసుకోవాలని వేంకటేశ్వరా కాలనీ అసోసియేషన్ అద్యక్షుడు గండు ధనం రెడ్డి కోరారు. మంగళవారం కాలనీ రోడ్డు నెంబర్ 3లో గల కమ్యూనిటీ హాల్ లో ఓజోన్ ఆసుపత్రి, విన్ విషన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా వైద్యుల పర్యవేక్షణలో కంటి పరీక్షలు, బి పి, మధుమేహ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ శిబిరంలో డాక్టర్స్ అరుణ, భవాని , సంజనలతో పాటు అంజలి, అనిల్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనక రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సందీప్, జాయింట్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి, కిరణ్ యాదవ్, నరేష్, మాధవ రావు తదితరులు పాల్గొన్నారు.

Tags: