సోషల్ మీడియా కన్వీనర్ గా ఏలె మహేష్ నేత
- పద్మశాలి సంఘం ఎల్బీనగర్ సర్కిల్
- నూతన కమిటీ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం
విశ్వంభర, ఎల్బీనగర్ : నూతనంగా ఎన్నిక అయిన పద్మశాలి సంఘం ఎల్బీనగర్ సర్కిల్ వారి కమిటీలో సోషల్ మీడియా కన్వీనర్ గా ఏలె మహేష్ నేత ఎన్నికయ్యారు. ఎల్బీనగర్ మన్సురాబాద్ లోని స్పందన పాలాది పాపయ్య పరమేశ్వర్ వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిధిగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కమర్తపు మురళి సమక్షంలో అధ్యక్షుడు పున్న గణేష్ నేత ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి సోషల్ మీడియా కన్వీనర్ గా ఎంపిక చేసిన కమిటీకి , నాకు ఎల్లవేళలా సహకారం అందిస్తున్న తెలంగాణ ప్రాంత, ఎల్బీనగర్ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు గుర్రం శ్రవణ్ కుమార్ నేత కు ధన్యవాదాలు తెలిపారు. పద్మశాలి సంఘ సంఘటితం కోసం , పద్మశాలి విద్యార్థి, యువజన సమస్యల పరిష్కార మార్గాల కోసం ప్రభుత్వానికి , సామాజిక వర్గానికి వారధిగా ఉండి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా సంఘ మార్గ దర్శకులు సీత ఆంజనేయులు, గజం అంజయ్య, కర్నాటి ధనంజయ, బొమ్మ రఘు రామ్ నేత, మనోహర్, కర్నాటి వెంకటేశం, పున్న శ్రీశైలం, రాపోలు సత్యనారాయణ, రామ్ చందర్, రవి, కమిటీ సభ్యులు , వివిధ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు హాజరయ్యారు.



