ధన్వంతరి గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

ధన్వంతరి గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

విశ్వంభర, షాద్ నగర్ : న్యాయవాదిగా,ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా,సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్. దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమ న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక, సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యంగాన్ని రూపొందించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని షాద్ నగర్ పట్టణ ధన్వంతరి గ్రామీణ వైద్యుల సంఘం తరఫున  ధన్వంతరి గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షుడు గన్నోజు రాజు, పట్టణ ధన్వంతరి గ్రామీణ వైద్యులు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం  యావత్ భారతావని ఆయన దేశానికి అందించిన విలువైన సేవలను స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో, ధన్వంతరి గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షులు గన్నోజ్ రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్  మహేష్, కోశాధికారి ఆంజనేయులు, గౌరవ అధ్యక్షులు తిరుపతి యాదవ్, రఘుపతి నాయక్, రంగయ్య, బుచ్చన్న, లీగల్ అడ్వైజర్  మాతాశ్రీ జానకమ్మ,చైర్మన్ అంజయ్య గౌడ్, ఉపాధ్యక్షులు మహేందర్, మరియు వైద్య మిత్రులు, పద్మనాభం నాయుడు, సురేష్, విట్టల్, రవి నాయక్, ఉపేందర్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Tags: