అమీనాబాద్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అమీనాబాద్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

విశ్వంభర, కోదాడ :- అనంతగిరి మండల అమీనాబాద్ గ్రామంలో అంబేద్కర్ యువసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామంలో  యువత అంబేద్కర్ చూపించిన దారిలో నడిచి, జీవితంలో గొప్ప స్థాయి కి చేరాలి అని అన్నారు. త్వరలోనే గ్రామంలో ఎస్ సి కమ్యూనిటీ హాల్ మంజూరు చేయించేలా ప్రయత్నం చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ దేవపంగు కృష్ణ, అంబేద్కర్ యువసేన అధ్యక్షుడు దేవపంగు రవి, ప్రసాద్ ,వంశీ, రంజిత్, నరేష్, రాజేష్, నిలాంబరావు, ఇరువు సత్యం, మహేష్, మధు, అనిల్, నిఖిల్, విజయ్, సందీప్, రంజిత్,  వెంకటేష్, ఖాసీం, సందీప్, నాగరాజు, రమేష్,తదితరులు పాల్గొన్నారు.

Tags: