కొంపల్లిలో ఘనంగా గావ్ ఛలో.. బస్తీ ఛలో.కార్యక్రమంలో పాల్గొన్న ఎం.పి.ఈటెల రాజేందర్.

 కొంపల్లిలో ఘనంగా గావ్ ఛలో.. బస్తీ ఛలో.కార్యక్రమంలో పాల్గొన్న ఎం.పి.ఈటెల రాజేందర్.

-డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధిచేసి పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు.
-ముఖ్య అతిథిగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మరియు జిల్లా కన్వీనర్ డా.మల్లారెడ్డి హాజరు.

విశ్వంభర, కొంపల్లి : భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గావ్ ఛలో.. బస్తీ ఛలో కార్యక్రమం మొదటిసారి కొంపల్లి మున్సిపాలిటీలో మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు సతీష్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మరియు జిల్లా కన్వీనర్ డా.మల్లారెడ్డి హాజరయ్యారు.వీరికి కొంపల్లి కూడలి వద్ద నుండి అంబేద్కర్ విగ్రహాం వరకు కళాకారులు, డప్పు వాయిద్యాలు, టపాకాయల వెలుగులతో స్వాగతం తెలిపారు.అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని మంచినీటితో ముందుగా కడిగి పాలాభిషేకం చేసారు.కార్యకర్తల కోలాహలం మధ్య, జై భీమ్, జై బీజేపీ నినాదాలతో కొంపల్లి కామన్ నుండి పాదయాత్రగా మున్సిపాలిటీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు.అనంతరం వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గావ్ ఛలో.. బస్తీ ఛలో కార్యక్రమం మొదటిసారిగా కొంపల్లి మున్సిపాలిటీలో నిర్వహించడం సంతోషంగా ఉందని పట్టణ అధ్యక్షులు సతీష్ సాగర్.మాజీ కౌన్సిలర్ జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి.లను వారు అభినందించారు.ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అనుచిత తప్పుడు వాక్యాలను కాండిస్తూ అంబేద్కర్ అందరివాడని తాను రచించిన రాజ్యాంగం వల్లే అందరం ఇక్కడ ఉన్నామని అన్నారు.తలపెట్టిన ఈ కార్యక్రమం ప్రతి గల్లీలో గావ్ ఛలో.. బస్తీ ఛలో నినాదంతో ముందుకు పోవాలని ఇదే కనుల పండుగగ నిర్వహించిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.మాపై నమ్మకం ఉంచి, ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం కల్పించిన జిల్లా శాఖకు కొంపల్లి బీజేపీ శాఖ తరుపున కృతజ్ఞతలను పట్టణ అధ్యక్షులు సతీష్ సాగర్ తెలిపారు.సతీష్ సాగర్ మాట్లాడుతూ.ఈ కార్యక్రమ నిర్వహణకు తోడ్పడి నాకు వెన్ను దండుగా ఉంటూ ప్రోత్సహించిన బీజేపీ జిల్లా అద్యక్షులు డా.మల్లారెడ్డి,ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి,ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, కౌన్సిల్ సభ్యులు జనార్ధన్ రెడ్డి,అసెంబ్లీ కోకన్వీనర్ శివాజీ రాజు, కొంపల్లి పట్టణ నాయకులు చక్రధర్, నర్సింహా,అశోక్, మధు, మహేశ్వర్ రెడ్డి, ప్రకాష్ రావు, దుర్గ, మాధురి, శ్రీనివాస్, అజయ్, పరమేశ్వర్, మహేష్ గార్లు మరియు ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడిన ప్రతి ఒక్క బీజేపీ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వాసు,జిల్లా ప్రధాన కారదర్శి విఘ్నేష్, కార్యదర్శి భరత సింహారెడ్డి, కుత్బుల్లాపూర్ పరిధిలోని వివిధ డివిజన్ అధ్యకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.సహకరించిన పోలీస్ అన్ని విభాగాల అధికారులకు మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

Tags: