ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
విశ్వంభర, ఆమనగల్లు, వెల్దండ జూలై 19 : - వెల్దండ మండల కేంద్రంలోని ఏవీఆర్ ఫంక్షన్ హాల్లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి ఆధ్వర్యంలో శంకర్ నేత్రాలయ వారి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథి సుంకిరెడ్డి కృష్ణారెడ్డి మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మెగా
ఉచిత కంటి వైద్య శిబిరం
జూలై 19 శుక్రవారం నుండి జూలై 27 శనివారం వరకు 9 రోజుల పాటు కొనసాగుతుందని కల్వకుర్తి నియోజకవర్గ ప్రాంత ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,ఈ కంటి వైద్య శిబిరంలో కంటి పరీక్షలతో పాటు
కంటి శుక్లాలకు కూడా సర్జరీ చేయడం జరుగుతుందని,
ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి నియోజకవర్గ ప్రాంత పేద ప్రజలకోసం ప్రముఖ వైద్య నిపుణులు శంకర నెత్రలయ వారిని అందుబాటులోకి తీసుకువచ్చి శిబిరాన్ని ఏర్పాటు చేశారని ప్రతి నిరుపేద కుటుంబం ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో
శంకర నేత్రాలయ మెంబర్ అరుణ్ కుమార్ రామ్ నుంతల మాజీ సర్పంచ్ రచ్చ శ్రీరాములు, కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు రవికాంత్ గౌడ్,అభినవ్ రెడ్డి వెంకటరెడ్డి,నరేందర్ గౌడ్,
ఫౌండేషన్ సభ్యులు రెడ్డి,యూసఫ్ బాబా, గణేష్,శ్రీపతి, శేఖర్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.