రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు గాంధీజీ విద్యార్థులు ఎంపిక

రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు గాంధీజీ విద్యార్థులు ఎంపిక

 ఎస్.జి.ఎఫ్ రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికైన గాంధీజీ విద్యార్థులు

 విద్యార్థులను అభినందించిన ఎస్ఐ 

బంగారు పథకాలతో సత్తా చాటిన గాంధీజీ విద్యార్థులు

 -- వచ్చే నెల 2,3,4 తేదీలలో సంగారెడ్డిలో జరగనున్న రాష్ట్రస్థాయి యస్.జి.ఎఫ్. కరాటే టోర్నమెంట్

విశ్వంభర, చండూరు :  ఉమ్మడి నల్గొండ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్.జి.ఎఫ్.) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ -14 ,అండర్ -17 కరాటే జిల్లా జట్టు ఎంపిక పోటీల్లో చండూరు మున్సిపాలిటీకీ చెందిన గాంధీజీ విద్యాసంస్థల విద్యార్థులు ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టుకు ఎంపికై, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనబోతున్నారు. కరాటే మాస్టర్ శ్రీధర్ సాగర్ శిక్షణలో శిక్షణ పొందిన గాంధీజీ విద్యాసంస్థల విద్యార్థులు అండర్ -14 లో సి.హెచ్. విష్ణు, ఎం. చక్రధర్ అండర్ -17 లో ఎం. శ్రీనిధి జిల్లా కరాటే జట్టుకు ఎంపికయ్యారు. నవంబర్ 2, 3, 4 తేదీలలో సంగారెడ్డి లో జరగనున్న రాష్ట్రస్థాయి ఎస్.జి.ఎఫ్ టోర్నమెంట్లో పాల్గొననున్నారు. అలాగే వి. ఐశ్వర్య, ఎన్.గోపిలతలు సిల్వర్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా గాంధీజీ విద్యాసంస్థలలో ఏర్పాటుచేసిన అభినందన కార్యక్రమంలో ఐదుగురు విద్యార్థులను స్థానిక ఎస్.ఐ. వెంకన్న గౌడ్ ఘనంగా సన్మానించి, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో పాల్గొని గెలుపొంది తల్లిదండ్రులకు, చదువుకున్న పాఠశాలకు, తెలంగాణ రాష్ట్రానికి పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని ఆశించారు. విద్యతో పాటు విద్యార్థులను అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్న గాంధీజీ విద్యాసంస్థల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ సత్యనారాయణ మూర్తి, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య,‌ విజయ కుమారి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: