ప్రభుత్వ ఉపాధ్యాయుడికి జాతీయ సామాజిక సేవ పురస్కారం
సామాజిక కార్యకర్త గురిజ మహేష్ కు జాతీయ సామాజిక సేవ పురస్కారం - యంగ్ ఇండియన్ సేవ పురస్కారం 2024 అవార్డు
విశ్వంభర, నల్గొండ : నాంపల్లి మండలంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, దామెర ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్త గురిజ మహేష్ కు జాతీయ సామాజిక సేవ పురస్కారం - యంగ్ ఇండియన్ సేవ పురస్కారం 2024 అవార్డు ను యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ స్థాపకులు బాలు, వీసీ సజ్జనార్ చేతుల మీదుగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, హైద్రాబాద్ లో అందజేశారు. ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలను, వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన మౌలిక సౌకర్యాలు, పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహకారంతో పాటు దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, తల్లిదండ్రులు లేని నిరాదరణకు గురైన పేద విద్యార్థుల చదువుల కోసం చేయూత , గ్రామీణ నిరుద్యోగులకు పోటీ పరీక్షల మార్గదర్శకత్వం వంటి సేవా కార్యక్రమాలను గుర్తించి జాతీయ సామాజిక సేవ పురస్కారం - యంగ్ ఇండియన్ సేవ పురస్కారం 2024 ను వరించింది. ఈ సందర్బంగా గురిజ మహేష్ మాట్లాడుతూ సమాజానికి చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి పురస్కారం అందించిన సంస్థ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వివిధ సామాజిక సేవా సంస్థల స్థాపకులు, సామాజిక సేవా కార్యకర్తలు పాల్గొన్నారు