సన్ షైన్ లో ఘనంగా దీపావళి వేడుకలు
విశ్వంభర, చండూర్ : దీపావళి పండుగ సందర్భంగా స్థానిక సన్ షైన్ పాఠశాలలో పండుగను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థినిలు స్వయంగా తయారు చేసిన మట్టి ప్రమిదలతో దీపాలను వెలిగించి వాటి గొప్పతనాన్ని తెలిపారు. అదేవిధంగా చిన్నారి విద్యార్థులు హ్యాపీ దీపావళి అక్షరమాల ఆకారంలో కూర్చొని అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కోడి వెంకన్న మాట్లాడుతూ దీపావళి పండుగ అనేది సత్యభామ నరకాసురుని వధించి ప్రజలకు మంచి చేకూర్చిన సందర్భంగా జరుపుకుంటారని, దీపాలు వెలిగించడం ద్వారా చీకటిని తొలగించి ప్రజల జీవితాల్లో వెలుగు నింప వచ్చని అన్నారు. ఎంత గొప్ప కార్యక్రమమైనా చిరు దీపాన్ని వెలిగించి ప్రారంభించడం ద్వారా దీపం యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాలని అన్నారు. ఈ సందర్బంగా బాణసంచా కాల్చి సంబరాలను నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కోడి సుష్మ గారు, ప్రిన్సిపాల్ రవికాంత్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.