జాతీయ స్ఫూర్తి పురస్కారం అందుకున్న దైద నాగరాజు
సామాజిక సేవా కార్యక్రమాల్లో దూసుకెళ్తున్న మనం స్వచ్చంద సంస్థ
సర్ధార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్ఫూర్తి పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది - మనం స్వచ్చంద సంస్థ నిర్వాహకుడు దైద నాగరాజు
విశ్వంభర, నార్కెట్ పల్లి: భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు, మొదటి ఉప ప్రధాని,హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతినీ పురస్కరించుకొని చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో మనం స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు దైద నాగరాజు కు సర్ధార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్ఫూర్తి పురస్కారం అందజేశారు. సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రముఖ సాంస్కృతిక, సాహిత్య, సామాజిక సేవా సంస్థలు హోప్ స్వచ్ఛంద సేవా త్యాగరాయ గాన సభలో సమితి, సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు దైద వెంకన్న అధ్యక్షతన సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్ఫూర్తి పురస్కారాలు 2024 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత డాక్టర్ శాంతాబాయి గౌరవ అతిథిగా, కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యులు,డా. నాలేశ్వరం శంకరం, ప్రత్యేక అతిథిగా గుర్రం జాషువా వారసురాలు అమృతపూడి రేవతి, ముఖ్య అతిథులుగా హాజరై సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన , పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ధైద నాగరాజు గత ఆరు సంవత్సరాలనుండి ఎన్నో సామాజిక సేవలు ప్రజలకు అందిచడం సమాజానికి ఎంతో స్ఫూర్తి దాయకం ఈ మధ్యకాలంలో మధ్యాహ్నం ఉచిత భోజనం నిర్వహించడం వంటి కార్యక్రామలు చేపట్టడం, రోజు వందల మంది పేదవారి ఆకలి తీర్చటం మహా పుణ్యకార్యంగా గా భావించిన ధైద నాగరాజుకి సంస్థ నుంచి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జాతీయ స్ఫూర్తి పురస్కారం అందించడం ఎంతో సంతోషంగా భావిస్తున్నామని సంస్థ నిర్వాహకులు తెలిపారు.