కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సహకారంతో పుస్తకాలు అందజేత 

 కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సహకారంతో పుస్తకాలు అందజేత 

స్టడీ సర్కిల్ , గ్రంధాలయ సంస్థలకు , మంత్రి కోమటిరెడ్డి దాతృత్వం

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువతీ, యువకులకు చేయూత 

విశ్వంభర, నల్గొండ : విద్యార్థులు కష్టపడి చదివి ఏపీజే అబ్దుల్ కలామ్ లాగ  ఉన్నత స్థానానికి చేరుకోవాలి అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా గ్రంధాలయ సంస్థ, జిల్లా పరిషత్ స్టడీ సర్కిల్ లో చదువుకుంటూ  కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోరిక మేరకు ప్రముఖ స్వచ్చంద సంస్థ కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తరపున ఒక లక్ష ఇరవైఅయిదు వేల రూపాయల ఖరీదు చేసేటువంటి పుస్తకాలని బుధవారం నల్గొండ లో  తన క్యాంపు కార్యాలయ ఆవరణంలో జెడ్పి స్టడీ సర్కిల్ , గ్రంధాలయ సంస్థకు అందజేశారు. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా జెడ్పి సీఈఓ నంద్యాల ప్రేమ్ కరణ్ కుమార్ రెడ్డి, స్థానిక గ్రంధాలయ లైబ్రేరియన్  బాలెమ్మా లకు మంత్రి సూచించారు. ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పోటీ పరీక్షలకు ఉపయోగపడే విలువైన పుస్థకాలను అందచేసిన మంత్రికి జెడ్పి సీఈఓ, గ్రంధాలయ లైబ్రేరియన్ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో  ఫౌండేషన్ సీఈఓ గోనా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కొలనుపాక రవికుమార్, లక్ష్మయ్య,  గుమ్మల మోహన్ రెడ్డి, రమేష్ పాల్గొన్నారు .

Tags: