గాంధీజీ ఫౌండేషన్ సేవలు అమోఘం -ఎస్సై వెంకన్న గౌడ్
- గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ
- గాంధీజీ ఫౌండేషన్ వారి 11వ నెల సరుకుల పంపిణీ
విశ్వంభర, చండూర్ : రెండు సంవత్సరాల వరకు ప్రతినెల 22 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు జనవరి నెల ఒకటో తేదీన ప్రారంభించిన నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం దీపావళి పండుగను పురస్కరించుకొని రెండు రోజులు ముందుగానే బుధవారం నాడు స్ధానిక గాంధీజీ విద్యాసంస్థల యందు పదకొండవ నెల పంపిణీ చేసారు.ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా ఎస్సై వెంకన్న గౌడ్ హాజరై వారు మాట్లాడుతూ డాక్టర్ కోడి శ్రీనివాసులు చండూరు మున్సిపాలిటీకి ఆదర్శవంతమైన వ్యక్తి అని, సమాజంలో డబ్బులు ఉన్న వారందరూ సేవ చేయరని, సేవ చేయాలనే ఆలోచన డాక్టర్ కోడి శ్రీనివాసులు రావడం అభినందనీయమని, నిరుపేదలకు ఆయన చేసిన సేవ ఎంతో గొప్పదని కొనియాడారు. ఏ ఆసరా లేని నిరుపేదలను చూస్తుంటే మనసు కలచివేస్తుందని, వీరికి త్వరలోనే నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ మంచి కార్యక్రమం చేస్తానని తెలిపారు. గాంధీజీ ఫౌండేషన్ ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని, రాబోయే రోజుల్లో ఈ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవలు పేద ప్రజలకు అందాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి కోడి అరుణ, కోడి ప్రీతి, కోడి శృతి, గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్స్ సత్యనారాయణమూర్తి, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, బుషిపాక యాదగిరి, బోడ విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు.