టాలీవుడ్ దృష్టి దేవుళ్లపైనేనా?.. రాబోయే సినిమాలు ఏంటంటే?
మామూలుగా హీరోలంటే అభిమానులకు దేవుళ్లే.. హీరోలకి అభిమానులు, ఆడియెన్స్.. ప్రేక్షకుల దేవుళ్లు.. ఇవన్నీ ఇండస్ట్రీలో వినిపించే మాటలే. కానీ ఇప్పుడు దేవుళ్ల మీద సినిమాలు తీస్తే.. బ్లాక్ బస్టర్ హిట్టే. ఇండస్ట్రీలో ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ఇతిహాసాలైన రామాయణ, మహా భారతాల మీద సినిమాలు తీశారు. ఇప్పుడు మళ్లీ అదే ట్రెండ్ నడుస్తోంది. సోషియో ఫాంటసీ చిత్రాలకు గిరాకీ పెరిగింది.
దేవుడ్ని తెరపై అలా ఒక్కసారి చూపించినా కూడా సినిమాకు కలెక్షన్లు మోతమోగిపోతోన్నాయి. అఖండని తీసుకున్నా.. హనుమాన్‌ను తీసుకున్నా.. రీసెంట్‌గా వచ్చిన కల్కిని తీసుకున్నా కూడా ఇప్పుడంతా ఏ ట్రెండ్ నడుస్తోందో చెప్పాల్సిన పని లేదు. దైవ భక్తిని చాటే చిత్రం, దేవుడి శక్తిని చూపించేలా కథ, కథనాలతో ఓ సినిమా వస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోవాల్సిందే.
అలాంటి కొన్ని చిత్రాలు ఇంకా టాలీవుడ్‌లో లైన్లో ఉన్నాయి. అఖండ 2 రాబోతోంది. కల్కి 2 ఎలాగూ వస్తోంది. అనసూయ ప్రధాన పాత్రలో నటించిన అరి కూడా రాబోతోంది. సూపర్ హిట్ ఫిల్మ్ పేపర్ బాయ్ దర్శకుడు జయశంకర్ తీసిన ఈ అరి చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఇందులో కృష్ణుడిదే మెయిన్ పాత్ర అని తెలుస్తోంది. ఇంత వరకి ఎవరు టచ్ చేయని అరిషడ్వర్గాలనే కాన్సెప్ట్ మీద అరి మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీ చివర్లో కృష్ణుడ్ని చూపించే సీన్‌కు గూస్ బంప్స్ పక్కా అని సమాచారం. వచ్చే ఏడాది రానున్న విశ్వంభర సోషియో ఫాంటసీ అన్న సంగతి తెలిసిందే. జై హనుమాన్ సెట్స్ మీద ఉంది. నిఖిల్ స్యయంభు, కార్తికేయ 3లు కూడా దైవ భక్తి చుట్టే తిరుగుతుందని తెలుస్తోంది.