*గ్రూప్- 2 గ్రూప్- 3 పరీక్షలను నెలరోజులు వాయిదా వేయాలి. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం తగదు.

WhatsApp Image 2024-07-18 at 15.15.05_62d13261

విశ్వంభర భూపాలపల్లి జూలై 18 : - తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ పరీక్షలను వాయిదా వేయాలని, నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారని వారి పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి, చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ అభిప్రాయపడింది.డీఎస్సీ పరీక్షలు ఈనెల 18 నుండి ఆగస్టు 5 వరకు ప్రభుత్వ నిర్వహిస్తుంది. ఇప్పటికీ హాల్ టికెట్లు జారీ చేశారు ఈ నేపథ్యంలో డీఎస్సీ రాసే వారిలో గ్రూప్ -2 మరియు గ్రూప్ -3 అభ్యర్థులు కూడా ఉన్నారు. గ్రూప్- 2 పరీక్షలు ఆగస్టు 7,8 తేదీలలో ఉన్న నేపథ్యంలో డీఎస్సీ రాసేవారికి ప్రిపరేషన్ కోసం సమయం సరిపోదు. ఈ కారణం చేత నిరుద్యోగులు గ్రూప్- 2మరియు గ్రూపు-3 లను కనీసం నెల రోజులైనా వాయిదా వేయాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ కూడా సరైనదే, గతంలో పేపర్ లీకేజీలు, టీజీ పీఎస్సీ తప్పిదాల వలన రాష్ట్రంలో నిరుద్యోగులు చాలా కాలాన్ని నష్టపోయారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ దాకనైన ప్రభుత్వ కొలువులు సాధించాలనుకుంటున్న ఈ పరిస్థితుల్లో ప్రిపరేషన్ కోసం సమయం సరిపోదు.అందులోనూ డీఎస్సీ సిలబస్ వేరు గ్రూప్స్ సిలబస్ వేరు కావున ప్రభుత్వం ఈ సున్నితమైన అంశంపై అభ్యర్థులతో చర్చించి సానుకూలంగా పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ తరపున కోరుతున్నాము అని ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ అన్నారు.ప్రభుత్వం సానుకూలంగా వివరించకుండా వారి పట్ల అహంకార భావంతో మాట్లాడడం, సరైనది కాదు. ఈ సమస్యను పరిష్కారం చేయాలని పోరాడుతున్న నిరుద్యోగులను అరెస్టులు చేసి కేసులు పెట్టడం, నిర్బంధించడం సరైన చర్య కాదని ఎస్ఎఫ్ఐ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ భావిస్తున్నది. గత ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్ లో గ్రూప్-1 పోస్టుల కంటే అదనంగా 63 పోస్టులు పెంచి మళ్లీ గ్రూప్-1 నిర్వహించిన ప్రభుత్వం, గ్రూప్- 2, గ్రూప్ -3 లలో కూడా పోస్టులు పెంచే ఆలోచనను, పరిశీలన చేసి రాష్ట్రంలో పోటీ పరీక్షలు నిర్వహించాలని, అరెస్టు చేసిన నిరుద్యోగులను విడుదల చేయాలని, ఈ సమస్యలతో పరీక్షలను నెలరోజులు వాయిదా వేసి పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. 
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు నరేష్ ,జిల్లా కమిటీ సభ్యులు స్వామి, హాస్టల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Read More మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు