చండూరు లో సైబర్ మోసం...

చండూర్ , విశ్వంభర :- నల్గొండ జిల్లా , చండూర్ లో యూనియన్ బ్యాంక్ పేరుతో వీరమల్ల నాగరాజు అనే వ్యక్తికి వాట్సాప్ ద్వారా లింక్ పంపిన సైబర్ నేరగాళ్లు. ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ మెసేజ్ సారాంశం పంపించడంతో బ్యాంకు నుంచే వచ్చిందని లింక్ ఓపెన్ చేసిన బాధితుడు.లింక్ ద్వారా వ్యక్తిగత డేటా మొత్తం సైబర్ నేరగాళ్లకు ఇచ్చిన నాగరాజు..రెండు దఫాలుగా అకౌంట్ లో రూ లక్ష మాయం చేసిన సైబర్ మోసగాళ్ళు..పోలీసులకు పిర్యాదు చేసిన బాధితుడు నాగరాజు..అవగాహన లేకుండా బ్యాంకుల నుంచి వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని కొద్దిరోజులుగా హెచ్చరిస్తూనే ఉన్న పోలీసులు.అవగాహనా రాహిత్యం తో సైబర్ నేరగాళ్ల మాయలో పడుతున్న అమాయకులు..కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతామని పోలిసులు తెలిపారు