ఈ తరానికి మార్గదర్శి నెల్సన్ మండేలా -రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవిఎల్

ఈ తరానికి మార్గదర్శి నెల్సన్ మండేలా -రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవిఎల్

నివాళులు అర్పించిన AIPSO జాతీయ అడ్వైయిజరి కమిటీ సభ్యులు జి.రఘుపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాచం సత్యనారాయణ 

హైద్రాబాద్,విశ్వంభర :-  ప్రపంచ మానవ హక్కుల పోరాట యోధుడిగా , ప్రపంచ శాంతి యోధుడుగా జీవితకాయలం , ప్రపంచ ప్రగతి కై పోరాడిన నెల్సన్ మండేలా జీవితం ,త్యాగాలు పోరాటాలు ఈ తరానికి ఆదర్శమని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం AIPSO జాతీయ అడ్వైయిజరి కమిటీ సభ్యులు జి.రఘుపాల్ , రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవి ఎల్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాచం సత్యనారాయణ లు తెలియజేశారునెల్సన్ మండేలా 106వ జయంతి కార్యక్రమం AIPSO ఆధ్వర్యంలో  చైతన్యపురిలో కాచం సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించడం  జరిగింది.ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ మాట్లాడుతూ నెల్సన్ మండేలా అందరికి ఆదర్శ నాయకుడని ప్రపంచానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. అడ్వైయిజరి కమిటీ సభ్యులు జి. రఘుపాల్ మాట్లాడుతూ నెల్సన్ మండేలా మహాత్మా గాంధీ సిద్ధాంతంతో ఆకర్షితుడైనాడని, ఆయన ప్రభావంతో దక్షిణాఫ్రికాలో జాతి వివక్షతకు వ్యతిరేకంగా అహింసా మార్గంలోనే పోరాడి  27 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాడని అన్నారు.  ఆయన చీకటి ఖండంలో సూర్యుడుగా వెలుగులు పంచాడని ఈ సందర్బంగా  గుర్తు చేశారు . రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవి ఎల్ మాట్లాడుతూ అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం, జాతీయ కమిటీ పిలుపుమేరకు నెల్సన్ మండేలా జయంతి కార్యక్రమాలు దేశమంతటా  జరుగుతున్నాయన్నారు.  సామ్రాజ్యవాదానికి జాతి వివక్షతకు అణచివేతకు  వ్యతిరేకంగా నెల్సన్ మండేలా చేసిన పోరాటాలు, మానవ హక్కుల పరిరక్షణ కొరకు చేసిన పోరాటాలు, ఎప్పటికీ ఆదర్శనీయమని అనుసరణీయమైన  ఆయన జీవితాన్ని పాఠాలుగా  చదువుకొని ప్రపంచ శాంతి కొరకు పోరాడాలని పిలుపునిచ్చారు.22WS 

ఈ కార్యక్రమంలో AIPSO  నాయకులు  పి. రవి కిషోర్ ,ఇరుగు శ్రీధర్ ,కాచం సాయికుమార్ ,అరుణ్ కుమార్ , కృష్ణారెడ్డి, దండు సురేష్,కొత్త రమ్య శ్రీ , శ్రీను , రమేష్, సాగర్ ,తదితరులు పాల్గొన్నారు 

Read More ఘనంగా మున్నూరు కాపు మహిళ సంఘం బతుకమ్మ వేడుకలు