రైతు రుణమాఫీ దేశానికే తెలంగాణ రోడ్ మోడల్..

WhatsApp Image 2024-07-19 at 15.31.35_c58b47a6

విశ్వంభర భూపాలపల్లి జూలై 19 : - రైతు రుణమాఫీ దేశానికే మన తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ అని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. నిన్న రైతు రుణమాఫీ నిధుల విడుదల చేసిన సందర్భంగా  శుక్రవారం భూపాలపల్లిలోని మంజూరు నగర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి నుండి స్థానిక అంబేద్కర్ సెంటర్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో రైతులు, కాంగ్రెస్ నేతలతో పెద్ద సంఖ్యలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.కాగా, ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు  పాల్గొని ఎడ్ల బండి ని స్వయంగా నడిపి ప్రారంభించారు. ఈ ర్యాలీ లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అంబేద్కర్ సెంటర్ వరకు స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చారు. ఈ ర్యాలీ అంబేద్కర్ సెంటర్ కు చేరుకునే సమయానికి ఒక్కసారిగా వర్షం కురియడంతో ఆ వర్షంలోనే సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ నిలిచిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసిందని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు ఊబిలోకి నెట్టిందని అన్నారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పులు చేశాడని ఆరోపించారు. కష్టకాలంలో ఉండి కూడా సీఎం రేవంత్ రెడ్డి పైసా పైసా పోగేసి రైతు రుణమాఫీ చేయడానికి అహర్నిశలు కష్టపడి పని చేశారని అన్నారు.

Read More గౌడ సంఘం అధ్యక్షులుగా కందాల వెంకట్రాజం గౌడ్